Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లాపండుగలు

District collector : హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జోష్..!

District collector : హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జోష్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ క్యాంప్ కార్యాలయం నుండి సాయుధ పోలీసులతో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బంగ్లాకు స్వయంగా వెళ్లి కలెక్టర్ దంపతులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పోలీస్ అధికారులకు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. అనంతరం ఎస్పి కార్యాలయానికి చేరుకొని ఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి ఆనందోత్సవాలతో నృత్యాలు చేస్తూ, పోడి రంగులు చల్లుతూ సందడి చేశారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లాఎస్పీ మాట్లాడుతూ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపి రంగుల మాయం చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. మరియు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని కోరారు. ఈ సంబరాల్లో ఆర్ ఐ. నరసింహ, ఆర్.ఎస్.ఐ. శివ శంకర్, ఎస్ఐ లు నరేష్, రమేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

  2. TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

  3. Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

  4. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  5. Miryalaguda : విశ్రాంత ఉద్యోగిని బెదిరించి రూ. 46 లక్షలు వసూలు..!

మరిన్ని వార్తలు