తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

నల్గొండ, జూన్20 , మన సాక్షి.

న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న సివిల్ కేసుల్లో పంచాయతీ కార్యదర్శులు జోక్యం చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక వేళ ఎవరైనా పంచాయతీ కార్యదర్శి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సివిల్ వివాదాల్లో, ముఖ్యంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో, న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుండగానే పంచాయతీ కార్యదర్శులు వివాదాస్పద స్థలాల్లో/ఇళ్లలో ఇంటి నంబర్లు కేటాయించడం లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల గ్రామస్థాయిలో న్యాయపరమైన సంక్లిష్టతలు పెరిగి, వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు.

ఈ రకమైన చర్యలు అనధికారికమైనవిగా, పరిపాలనా హోదాకు అతీతమైనవిగా పరిగణించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇవి న్యాయ ప్రక్రియలకు భంగం కలిగించడమే కాకుండా, పంచాయతీరాజ్ శాఖకు ,జిల్లా యంత్రాంగాయానికి అనవసరమైన న్యాయ పరమైన సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, అలాగే ప్రజలనుండి విమర్శలను తెచ్చిపెడతాయని పేర్కొన్నారు.

అందువల్ల పంచాయతీ కార్యదర్శులు వివాదాస్పద ప్రాంతాల్లో/ఇళ్లలో లేదా లిటిగేషన్ ఉన్న సందర్భాల్లో ఇంటి నంబర్లు లేదా ఆస్తి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. ఇలాంటి అనధికారిక చర్యలను జిల్లా యంత్రాంగం ఇకపై సహించబోదని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ విషయంపై ఎం పి డి ఓ లు,ఎం పి ఓ లు పై సూచనల పై పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఆసుపత్రి, సదరం క్యాంపు ఆకస్మిక తనిఖీ..!

  2. Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!

  3. District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

  4. Penpahad : గ్రామాల్లో పోలీస్ ప్రభ భరోసా..!

  5. Rainy Season: వర్షాకాలంలో దోమల బెడద తగ్గించుకోండిలా..!

మరిన్ని వార్తలు