District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. ప్రభుత్వ భూములపై కీలక ఆదేశాలు..!

District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. ప్రభుత్వ భూములపై కీలక ఆదేశాలు..!
కరీంనగర్, మన సాక్షి:
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు.
ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే ల్యాండ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను పరిశీలించారు.
రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!
-
Shoes : షూస్ ఎంపిక ఎలా ఉండాలో తెలుసా.. ఇలా ఉంటేనే కొనండి..!
-
High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!
-
LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!
-
Urea : యూరియా కోసం బారులు తీరిన వేలాది మంది రైతులు..!









