Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!

Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి రోడ్డు విస్తరణ కోసం చేసిన గుర్తు లను (మార్క్) పరిశీలించి భవన యజమానులను నష్టపరిహారం సొమ్ము అందిందా లేదా అనే విషయం అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణలో నష్ట పరిహారం సొమ్ము దక్కిన యజమానులు తమ నిర్మాణాలు తొలగించి సహకరించాలని కోరారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట అంబేద్కర్ భవనము కోసం గుర్తించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ పౌంటైన్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ నష్ట పరిహారం పొందిన భవనాల యజమానులు ఆర్ అండ్ బీ నిబంధనల మేరకు భవనాలు తొలగించడంతో పాటు మున్సిపల్ శాఖ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ వదిలి కొత్త నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు 33 కోట్ల మేరకు లబ్ధిదారులకు నష్ట పరిహారం అందజేశామని, వారసత్వ వివాదాల కారణంగా మరో 6 కోట్ల మేరకు చెల్లింపులు జరపాల్సి ఉందన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ ఐ ఠాకూర్ రామక్రిష్ణ, సర్వేయర్ ఖదిర్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..!

  2. Elections : స్థానిక ఎన్నికలు.. పల్లెల్లో ఆశావహుల సందడి..!

  3. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  4. LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!

మరిన్ని వార్తలు