Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అందుకుగాను 15 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన నిర్మల్, నిజాంబాద్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరంజ్ అలర్ట్ ను జారీ చేసింది.

అదేవిధంగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.

ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

MOST READ : 

  1. Agricultural Tools : వారికి వ్యవసాయ పరికరాలు 50 శాతం సబ్సిడీ.. ధరఖాస్తు ఇలా..!

  2. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!

  3. LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!

  4. Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!

  5. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

మరిన్ని వార్తలు