Nalgonda : నల్గొండలో వినాయకుడికి తొలి పూజ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!
Nalgonda : నల్గొండలో వినాయకుడికి తొలి పూజ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
జిల్లా ప్రజలు సుఖ, సంతోషాలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపుకోవాలని ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు మండపాల సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో చవితికు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని, విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాటు చేయాలని ఇది వరకే అధికారులను, సిబ్బందిని ఆదేశించామని, బారికేడ్లు, క్రేన్ల ఏర్పాటు గజ ఈతగాళ్లు, లైటింగ్, వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వినాయకుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాంరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, రామగిరి రామాలయం మండప నిర్వాహకులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన మిర్యాలగూడ సబ్ కలెక్టర్..!
పేదరికం అడ్డు కాదని నిరూపించిన పేదింటి ఆడబిడ్డ..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









