District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!

District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, వర్షకొండ గ్రామంలో శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా (ఈజీఎస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ పాఠశాల భవన పనులను నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు.
డబ్బా , వర్షకొండ గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించని వారు ఉంటే వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
ఇండ్ల పనులు ప్రారంభం చేయనటువంటి లబ్ధిదారులకు రెండు, మూడు నోటీసులు అందించి అర్హులైన వారికి కేటాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, హోసింగ్ పిడి ప్రసాద్, ఎంపీడీవో, తహసిల్దార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!
-
District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!
-
Suryapet : ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..!
-
District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!









