District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..!
కొల్చారం, మన సాక్షి :
విధుల యందు బాధ్యతారహిత్యంతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. అనధికారికంగా కొల్చారం వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నట్లు ఆకస్మిక సందర్శనలో కలెక్టర్ గుర్తించారు.
బాధ్యతా రాహిత్యానికి కొల్చారం ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక సందర్శనలో వైద్య సిబ్బందిపై వేటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొల్చారం పీహెచ్‌సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.
ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని, స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చేయుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
విధులలో నిర్లక్ష్యం వహిస్తూ హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు గైరాజర్ అయిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం చర్య తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శన సమయంలో, మెదక్ జిల్లా కుల్చారం పిహెచ్‌సికి చెందిన కింది ఉద్యోగులు ఎటువంటి సమాచారం లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా హాజరు పట్టికలో కింద సంతకం చేసిన వ్యక్తి నుండి ఎటువంటి సెలవు మంజూరు లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గమనించినట్లు కలెక్టర్ తెలిపారు.
విధులకు హాజరైనట్టు అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్నప్పటికీ అనధికారికంగా వారు విధుల్లో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ నిర్వహించిన తర్వాత, ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్‌ను ఆయన ఆదేశించారు.
MOST READ :
- Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!
- Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
- Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
- Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!









