Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మెడికల్ ఆఫీసర్, సిబ్బందికి మెమొలు.. వాచ్ మెన్ తొలగింపు..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మెడికల్ ఆఫీసర్, సిబ్బందికి మెమొలు.. వాచ్ మెన్ తొలగింపు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆమె గురువారం రాత్రివేళ డిండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంలో మెడికల్ ఆఫీసర్ కు సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగి వాచ్ మెన్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.

వివరాల ప్రకారం.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేవరకొండ ఆసుపత్రి ఓపి, ఇన్ పేషెంట్లు, వివిధ వార్డులను ఆమె తిరిగి పరిశీలించారు. ఆస్పత్రి వైద్యాధికారితో ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలు, పేషెంట్లు వివరాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద వైద్యులకు సరైన వైద్యం అందించాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. గుండ్లపల్లి డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల లో డ్రైనేజీ సమస్యను, సోలార్ లైట్ల సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

అదేవిదంగా (గుండ్లపల్లి) డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలను, వంటగదిని ,స్టోర్ రూమ్ , తరగతి గదులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన వంట సరుకులను తనిఖీ చేశారు.

అనంతరం ఇంటర్మీడియట్ ,5 ,6 తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్య పరిజ్ఞానాన్ని ప్రశ్నలు, జవాబుల ద్వారా పరీక్షించారు. విద్యార్థినిలు బాగా చదువుకోవాలని, సమయాన్ని వృధా చేయవద్దని, విద్యద్వారానే సమాజంలో మంచి స్థానాన్ని పొందవచ్చు అని సూచించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ గుండ్లపల్లి డిండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు . జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండడం, 20 నిమిషాల తర్వాత వాచ్ మెన్ వైద్య ఆరోగ్య కేంద్రానికి రాగా పి హెచ్ సి లో ఎవరూ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాచ్ మెన్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బందికి మెమొలు జారీ చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.

■ MOST READ : 

  1. Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

మరిన్ని వార్తలు