Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. కేసులు నమోదైన మిల్లర్లపై చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. కేసులు నమోదైన మిల్లర్లపై చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లాలో ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సివిల్ సప్లై అధికారి, డి యం, డి ఆర్ డి ఏ పిడి, మెప్మా, డి సి ఓ, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు పూర్తి అయిన సందర్బంగా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐ కే పి, మెప్మా, సహకార సంఘాలు, మార్కెటింగ్ లు లాంటి వివిద శాఖలు సమన్వయము చేసుకుంటు జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినందుకు అధికారులను అభినందించారు.ట్రక్ షీట్ ఆన్లైన్ లో నమోదు చేసిన 48 గంటలలోనే రైతులకి డబ్బులు జమ చేయటం జరుగుతుందని తెలిపారు.

వచ్చే సీజన్ నాటికి ప్రతి సెంటర్ లో పాడి క్లినర్స్ ఉండేలా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డి ఆర్ డి ఏ పిడి ని, డి సి ఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సీజన్ లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని వచ్చే సీజన్ నాటికి పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలని అధికారులకి సూచించారు.

కేసులు నమోదు అయిన మిల్లర్లు పై కఠిన చర్యలు తీసుకోవాలని, అట్టి మిల్లులపై రోజు వారి నివేదికలు తమకి సమర్పించాలని అధికారులకి సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జూన్, జులై, ఆగస్టు(3) నెలలకి కలిపి ఒకేసారి సన్నబియ్యం చివరి కార్డు వరకు అందేలా జూన్ 30 వరకు పంపిణి కొనసాగుతుందని లబ్ధిదారులు ఒకేసారి రేషన్ షాప్ లకి ఎక్కువగా వస్తే ఎక్కువ సేపు నిల్చొవాల్సి వస్తుంది కాబట్టి రోజు కొంతమంది వచ్చేలా చూసుకోవాలని కలెక్టర్ అధికారులకి సూచించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు,సివిల్ సప్లై డి యం ప్రసాద్, సివిల్ సప్లై అధికారి శ్రీనివాసరెడ్డి, డి సి ఓ పద్మ, మెప్మా పిడి రేణుక, అగ్రికల్చర్ అధికారి ప్రణవి,సివిల్ సప్లై డి టి లు, ఆర్ ఐ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. MF : వృద్ధికి స్థిరత్వాన్ని జోడించే లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్‌ ఆవిష్కరణ..!

  2. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Cm Revanth Reddy : 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సభ స్థలిని పరిశీలించిన రాచకొండ సిపి..!

మరిన్ని వార్తలు