District collector : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నిర్దేశించిన లక్ష్యాలను నెలాఖరు నాటికి సాధించాలని, ప్రతి మండలంలో లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్త్రీ నిధి రివ్యూ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలపై అప్పు నిలువ 74.5 కోట్లు ఉండగా 9 కోట్ల 76 లక్షలు బకాయిలు ఉన్నాయని నవంబర్ నెల చివరి వరకు బకాయి మొత్తం వసూలు చేసి జిల్లా రికవరీనీ 90 శాతానికి పెంచాలని ఏ పీఎం, సీసీ లను ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 40 కోట్లు రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 22.68 కోట్లు పంపిణీ చేశారనీ , మిగతా మొత్తాన్ని తొందరగా పూర్తి చేయాలన్నారు. లోన్ బీమా, ప్రమాద బీమా క్లైమ్ లను వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, డి ఆర్ డి ఓ మొగులప్ప, స్త్రీ నిధి జోనల్ మేనేజర్ శ్రీనివాసులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, డీ పీ వో సుధాకర్ రెడ్డి, స్త్రీ నిధి జిల్లా రీజినల్ మేనేజర్ తిరుపతయ్య, డిపిఎంలు, ఏ పీ ఎం లు, సీసీలు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. 20 మంది ఉన్న పత్తి కూలీల ఆటో బోల్తా..!
-
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలి..!
-
Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..!
-
Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!










