District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగితే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగితే చర్యలు.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్, కాచారం గ్రామాల్లో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మాయిచింగ్ చేయాలని ఆదేశించారు.
నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలని అన్నారు
అలాగే, ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రాక్ సిట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. ప్రతి రోజు ఎన్ని లారీలు తరలించబడుతున్నాయి, ఎంత ధాన్యం వస్తుంద నీ ఒక్కో లారీలో ఎన్ని బస్తాలు అనే వివరాలు నిరంతరం నమోదు చేసి, తగిన రికార్డులు నిర్వహించాలి అని సూచించారు.
ధాన్యం సెంటర్లలో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్ ఉంచాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నీటి సదుపాయం, ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హమాలీలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజనల్ అధికారి జివాకర్ తహసిల్దార్ వసంత ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ సూచన..!
-
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
-
PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలోకి రావాలంటే.. రైతులు ఇది చేయాల్సిందే..!









