Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలోకి రావాలంటే.. రైతులు ఇది చేయాల్సిందే..!

PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలోకి రావాలంటే.. రైతులు ఇది చేయాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM KISAN) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతలుగా 6000 రూపాయలను అందిస్తుంది. ఈ పథకమును 2018 డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభించారు. ఇప్పటివరకు రైతులకు 19 విడతలుగా 2000 రూపాయల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేశారు. మరికొన్ని రోజుల్లో 20 విడత నిధులు రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనున్నది.

అయితే 20వ విడత నిధులు పొందాలంటే రైతులు ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంది. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసుకొని 11 అంకెల నెంబరు ఉన్న కార్డును పొందాల్సి ఉంది. అదేవిధంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే 20వ విడత కిసాన్ నిధులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అంటే..?

ఆధార్ కార్డు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా భూమి ఉన్న ప్రతి రైతుకు డిజిటల్ ఐడి కార్డును అందిస్తుంది. దీనిని ఆధార్ కార్డుతో లింకు చేస్తారు. ఆధార్ కార్డు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. రైతు పేరు, భూమి, పంట వివరాలు మిగతా సమాచారం అంతా ఉంటుంది.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..?

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు, ఫోన్ నెంబర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంది. దీనిని ఆన్‌లైన్ లో నమోదు చేసి 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును అందజేస్తారు. పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in లో ఫార్మ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకో వచ్చును.

Similar News :

  1. PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

  2. PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల కోసం.. డిసెంబర్ 31 లోగా రైతులు రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  5. Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు