District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!

District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!
కరీంనగర్, మనసాక్షి :
మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ అమ్మకాలను పరిశీలించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే డ్రగ్స్ డిడక్షన్ కిట్లు తెప్పించామని, అవసరానికి అనుగుణంగా మరిన్ని కొనుగోలు చేస్తామని అన్నారు.
జిల్లాలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కు పాదం మోపుతామని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)
-
Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!
-
Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!









