District Collector : జిల్లా కలెక్టర్ ఆకాంక్ష.. మహిళలు కోటీశ్వరులు గా మారాలి..!
District Collector : జిల్లా కలెక్టర్ ఆకాంక్ష.. మహిళలు కోటీశ్వరులు గా మారాలి..!
సూర్యాపేట, మనసాక్షి:
మహిళలు కోటేశ్వరులుగా మారాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో అలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్ ప్రైన్యూర్ ఆఫ్ ఇండియా), గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ (సెర్ప్) మహిళలకి నిర్వహించిన శిక్షణ తరగతులులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాంప్ (రైసింగ్ అండ్ ఆక్సిలీరేటింగ్ ఎమ్ ఎస్ ఎమ్ ఈ పెర్ఫార్మన్స్) అనేది ప్రపంచ నిధులతో ఎమ్ ఎస్ ఎమ్ ఈ ను బలోపేతం చేసే పథకం. ర్యాంప్ పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాలును ఎమ్ ఎస్ ఎమ్ ఈ పరిధిలోకి తెచ్చి వారి అభ్యున్నతి సాధించాలనే సంకల్పం తో పని చేస్తుంది అన్నారు.
అని, దీనిలో భాగంగా మహిళలను వ్యాపారవేత్తలాగా మారెందుకు 15 రోజుల పరిశ్రమ నిర్వహణ, వ్యాపార ఉత్పత్తుల మార్కెటింగ్ మెలుకువలు, నైపుణ్యభివృద్ధి కొరకూ శిక్షణ ఇవ్వటం జరుగుతుందని శిక్షణ అనంతరం ఎస్ హెచ్ జి మహిళల కోసం సొంతంగా వ్యాపారం చేయుటకి అవసరమైన సహాయం చేస్తుందని తెలిపారు.
మహిళలకి బ్యాంక్ లింకేజి ల ద్వారా జిల్లాలో 700 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగిందని దీని ద్వారా మహిళలు కిరణ్,ఫ్యాన్సీ, చీరల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి యూనిఫామ్ లు మహిళా సంఘాల ద్వారానే కుట్టించటం జరుగుతుందని, ప్రభుత్వం త్వరలోనే సోలార్ ప్లాంట్స్, గోదాం లు,పెట్రోల్ బంక్ లు మహిళలలచే ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
వేల కిలోమీటర్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది అని అలాగే సమాలోచనలు ఉన్న మహిళలు అందరు కలిసి ప్రణాళిక బద్దంగా వ్యాపారం చేసి మార్కెటింగ్ లో మెలుకువలు తెలుసుకొని ఆకర్షణియంగా ప్యాకింగ్ చేస్తూ మారుతున్న సమాజం కి అనుగుణంగా నైపుణ్యాన్ని నేర్చుకోన్ని డిమాండ్ ఉన్న వాటిలో వ్యాపారం చేసి ఉన్నత స్థాయి కి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో అలీప్ సెక్రటరీ పద్మజ కృపాకర్, డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు, ఏపిడి సురేష్, లక్ష్మీనారాయణ, డి బి యమ్ లు, ఏ పి యమ్ లు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!
-
Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!









