Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..! 

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..! 

సూర్యాపేట, మనసాక్షి

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణం లోని కుడకుడ బస్తీ దావఖానను మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

తదుపరి ఓపి రిజిస్టర్, ఫార్మసి స్టోర్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఏమైనా మందులు కావాలంటే ముందుగానే తెలియజేయాలని సూచించారు. అక్కడే ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సిబ్బంది మంచిగా వైద్యం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిషా, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి, స్టాప్ నర్స్ రమాదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : భూసేకరణ పునరావాస, ఉపాధి పనులు వేగవంతం చేయాలి..!

  2. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  4. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

మరిన్ని వార్తలు