తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుపండుగలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..!

కరీంనగర్, మనసాక్షి :

గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూర్ చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు.

నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు.

చెరువులో బోట్లను, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, తగినంత హై మాస్ట్ లైటింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ గణేష్ నిమర్జనం నేపథ్యంలో నగరంలో, నిమజ్జన ప్రాంతాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు, వన్ వే వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్, సిపి నిమజ్జన ప్రాంతాలను, చెరువు పరిసరాలను డ్రోన్ సాయంతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు రాధాకృష్ణారెడ్డి, రమేష్ విద్యాసాగర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

  2. Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

  3. Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

  4. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

మరిన్ని వార్తలు