తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

జగిత్యాల, మన సాక్షి:

రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల మండలంలో కట్ల కుంట గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ భూభారతి రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసే పరిష్కరించాలని అన్నారు.

వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు వాటి  పూర్తి వివరాలు తీసుకోవాలని, భూ భారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ  కార్యక్రమంలో  కోరుట్ల రెవెన్యూ డివిజనల్ కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, తహసిల్దార్ మునీందర్ ఎంపీడీవో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!

  2. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  3. Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!

  4. Heart Health: గుండె ఆరోగ్యానికి అద్భుతమైన 5 ఆహార పదార్థాలు..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు