Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలి..!

District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలి..!

కొల్చారం, మన సాక్షి :

ధాన్యం అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేవిధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు.రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు.ఏ లారీ కూడా 24గంటలకు మించి వెయిటింగ్ లో ఉండకూడదని అందుకు తగ్గట్టు గా రైస్ మిల్లర్లు హమాలీలని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అనంతరం ‌ వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు సంబంధిత వివరాలను ‌ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 82 వేల 481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని 21,277 మంది రైతులకు గాను 54 కోట్ల 52 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.

రైతులు అహర్నిశలు కాయ కష్టం చేసి
పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొంది ‌ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని మిల్లర్లు సహకరించి త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకొని వెంటనే లారీలను పంపించాలని ‌ సూచించారు.వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం.. తేమ, తాలు చూసుకొని వెంటనే తూకం చేయాలని సూచించారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిస, డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, వరిగుంతం సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్, సీఈఓ రాములు, సీఈఓ సాయి రెడ్డి, సత్యసాయి రైస్ మిల్ యాజమాన్యం శ్రీను రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అలా చేస్తే కఠిన చర్యలు..!

  2. Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!

  3. RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..! 

  4. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

మరిన్ని వార్తలు