తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!

District collector : ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి జగిత్యాల మండలం బాలపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అందుబాటులో తార్పలిన్ కవర్లు, ఉండాలని అన్నారు.

కొనుగోలు  చేసిన ధాన్యం ను వెంటనే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  జగిత్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలిస్తున్నామని ప్రతిరోజు మిల్లులకు , రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి  కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు.  ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట  జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ .డి ఎస్ ఓ .డి ఎం మరియు తహసిల్దార్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!

  3. District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!

మరిన్ని వార్తలు