క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

District SP : వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు..!

District SP : వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు..!

మహబూబాబాద్ జిల్లా, మన సాక్షి:

వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో మాహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. విద్యార్థులు వేసవిలో చల్లదనం కోసం గ్రామాలలోని చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎటువంటి రక్షణ సదుపాయాలు లేని చోట్ల ఈతకు వెళ్లనీయరాదని స్పష్టం స్నేహితుల ప్రోద్బలంతో అజాగ్రత్త చర్యలకు పాల్పడి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశారు.

వేసవి సెలవుల్లో ప్రజలు తమ సొంత ఊర్లకు, వివిధ ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్న సందర్భంలో ఇంటి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును లాకర్‌లో భద్రపరచాలి లేదా తమ వెంట తీసుకెళ్లాలి.

ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటి లోపల మరియు బయట లైట్లు వెలిగించి ఉంచాలి. ఇంటి బయట తాళం వేసే ప్రసక్తి లేకుండా లోపల నుండి గొల్లెం వేసుకోవాలి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్ ద్వారా పర్యవేక్షించవచ్చు.

అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు మరియు వాచ్మన్ లను ఏర్పాటు చేయాలి. గడచిన రోజుల్లో పేపర్, పాల డెలివరీలను నిలిపివేయడం మంచిది. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 100 కి లేదా దగ్గరి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.

ఇంటి పరిధి పోలీస్ స్టేషన్ మరియు ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి మరియు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వడం చట్టపరంగా నిషిద్ధమని, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాలలో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగేమత్తు పదార్థాల వినియోగం మరియు బెట్టింగ్ లాంటి చట్టవిరుద్ధకార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు యుద్ధ ప్రాతిపదికన రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నారని ప్రజలు కూడా తమ భద్రత కోసం పోలీసులకుసహకరించాలని ఎస్పీ కోరారు.

జిల్లా ప్రజలందరూ వేసవి సెలవులు సురక్షితంగా గడిపేందుకు ఈసూచనలు పాటించగలరని మాహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసారు.

MOST READ :

  1. PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

  2. TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!

  3. Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!

  4. KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

  5. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు