సూర్యాపేట : డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి

డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేటరూరల్,19 డిసెంబర్, మన సాక్షి : సూర్యాపేట మండల పరిధి లోని టేకుమట్ల గ్రామ చౌరస్తా సమీపంలో ఎన్ హెచ్ 65 హైవే మీద ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన కొడగాని శంకర్ (21) గ్రామం పల్సర్ బైకును అతివేగంగా ఆ జాగ్రత్తగా నడిపి డివైడర్ ను ఢీకొట్టగా అతని తలకు రక్త గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చొని ఉన్న అదే గ్రామానికి చెందిన  ముచ్చపోతుల అంజన్ కుమార్ తండ్రి లింగస్వామి కి గాయాలయ్యాయి. ఇద్దరినీ సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు వీరిద్దరూ రాయన్ గూడెం లో బంధువుల పెళ్ళికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ముచ్చపోతుల అంజన్ కుమార్ యొక్క బాబాయ్ ముచ్చపోతుల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదని పోలీసులు తెలిపారు.