Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Dharani : ధరణికి సంబంధించి ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో ఉండొద్దు.. వారంలోగా పరిష్కరించాలి.!
Dharani : ధరణికి సంబంధించి ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో ఉండొద్దు.. వారంలోగా పరిష్కరించాలి.!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
వారం లోపు ధరణి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్. డి.ఓ.ను ఆదేశించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి ద్వారా స్క్రోటేనింగ్ ప్రాసెసింగ్ ఎలా నిర్వహిస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని చేస్తున్నారని అడిగారు.
ఆర్డీవో కార్యాలయంలోనే ఎక్కువ పెండెన్సీ ఉంది. వారంలోపు ధరణికి సంబంధించిన ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకుండా పరిష్కరించాలని ఆర్డీవోను స్పీడ్అప్ చేయాలనీ ఆదేశించారు. అనంత్రం ఆర్. డి. వో. కార్యాలయ పరిసరాలు పరిశీలించారు. రికార్డు రూమ్, ఎ. వో. రూమ్, అన్ని గదులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్, తాసిల్దార్ రాణా ప్రతాప్, ఏవో కార్యాలయ సిబ్బంది ధరణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









