Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
మనసాక్షి:
దీపావళి అనేది పండుగ అని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఈ పండుగ హిందువులంతా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. నివాళులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సాయంత్రం వేళలో ఇంటి ముందు దీపాలు వెలిగించి టపాసులు పేల్చుకుంటారు.
దీపావళి పండుగ చెడుపై మంచికి విజయంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటారు. అయితే దీపావళి అనే గ్రామం కూడా ఉంది. అది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అసలు దీపావళి అనే ఆ ఊరు పేరు ఎలా వచ్చింది? ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దీపావళి పండుగను ఐదు రోజులపాటు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ ఆ గ్రామంలో ఓ ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవడంతో దీనికి ఒక ప్రత్యేక సంప్రదాయం కూడా ఉంది.
అదేంటంటే.. శ్రీకాకుళంలో పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఆ గ్రామం మీదుగా వెళ్లే సమయంలో శ్రీ కూర్మానాద్ ఆలయాన్ని సందర్శించి.. తిరిగి వచ్చే సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. అయితే ఆ రాజుకు ఆ గ్రామస్తులు పరుగెత్తి దీపాలు వెలిగించి.. సపర్యలు చేశారు. రాజుకు స్పృహ రాగానే ఆ ఊరు పేరు అడిగాడు. అప్పటికి ఆ గ్రామానికి పేరు లేదని ఆ గ్రామస్తులు తెలిపారు.
అప్పుడు ఆ రాజు మీరు నాకు దీపాల వెలుగుతో సేవ చేశారు. కాబట్టి ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టాను అన్నాడు. అప్పటినుంచి ఆ గ్రామం పేరు దీపావళిగా పిలుస్తున్నారు. అయితే ఈ గ్రామంలో తెల్లవారుజామున దీపావళి పండుగ రోజున తెల్లవారుజామున నిద్రలేచి పూజలు, పితృకర్మ చేస్తారు.
ఈ గ్రామంలో ఎక్కువగా సోనాటి కమ్యూనిటీ ప్రజలు ఉన్నారు. దీపావళి రోజున పితృ పూజ చేసి పూర్వీకుల దీవెనలు పొందేందుకు కొత్త బట్టలు ధరిస్తారు. దీపావళి సమయంలో సంక్రాంతికి జరిగినట్లే ఇక్కడ కూడా తన అత్తమామల ఇంటికి వచ్చే అల్లుడికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.
ఈ గ్రామంలో ప్రస్తుత జనాభా ఒక వెయ్యి వరకు ఉంటారు. పండుగ రోజు మిఠాయిలు పంచుకుంటారు. అంతేకాకుండా గ్రామానికి వచ్చే కొత్త అల్లుడికి ఆ కుటుంబ సభ్యులు కొత్త బట్టలు పెట్టి సకల మర్యాదలు చేస్తారు. ఈ గ్రామం దీపావళి అనే పేరుతో ఉన్న కారణంగా ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తూ.. దీపావళి పండుగ జరుపుకోవడం కొనసాగుతుంది.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే..!
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
-
Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
District Collector : నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి.. బాధ్యతల స్వీకరణ..!









