TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా ఫిబ్రవరి 21వ తేదీన నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేయనున్నారు. ఏడు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో మాత్రమే ఈ పథకానికి నిధులు విడుదల చేయనున్నారు.

అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నది. ప్రస్తుతం మొదటి విడత 72,045 ఇండ్లను నిర్మించనున్నారు. వీరికి 5 లక్షల రూపాయలను నాలుగు విడతలుగా మంజూరు చేస్తారు.

లబ్ధిదారులకు ముగ్గు పోసి బేస్మెంట్ లెవల్ పూర్తయ్యాకనే మొదటి విడత డబ్బులను లక్ష రూపాయలు మంజూరు చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఇంటి నిర్మాణం పూర్తయ్యాక 5 లక్షల రూపాయలను అందజేయనున్నారు.

MOST READ : 

  1. Narayanpet : కెసిఆర్, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు