Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముట్టడి..!
Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముట్టడి..!
తొర్రూరు, మన సాక్షి :
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపలగిరి రోడ్డులో నిర్మించిన 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముట్టడించారు.
గత నాలుగు రోజులుగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా, శనివారం గోపాలగిరి రోడ్డులో ఉన్న ఇండ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలు మాట్లాడుతూ, “రెండు సంవత్సరాల క్రితమే మాకు ఈ ఇండ్లు కేటాయించామన్న హామీ ఇచ్చారు.
కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు పంపిణీ జరగలేదు. వెంటనే ఇళ్ల పంపిణీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులతో కలిసి అర్హులైన పేదలు ఇండ్లకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ,పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తౌటం గణేష్, తాసిల్దార్ గడిల శ్రీనివాస్, ఆర్‌ఐ నిజాముద్దీన్,అధికారులు చేరుకొని సిపిఎం నాయకులతో,మహిళలతో చర్చించారు. అంతిమంగా అధికారులు 45 రోజుల్లోగా అర్హులైన పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి, విచారణ అనంతరం న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అధికారుల హామీతో నిరసన తాత్కాలికంగా శాంతించింది.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుటం గణేష్, తహసిల్దార్ గడీల శ్రీనివాస్,ఆర్ఐ ఎండి నిజాముద్దీన్, అధికారులు శ్రీనివాస్ రాజు, ఎండీ.యాకూబ్, మంజుల, ఉపేంద్ర, కళ్యాణి, వీరమ్మ, జమిళ, రేణుక, భవాని, లింగమ్మ, విజయ, పద్మ, యకమ్మ, సమ్మక్క, రేణుక, షామైన, సౌజన్య, నిరాజ, శిరీష, సజోజన, శంతిషిణి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!
-
Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!









