Drinking Water: పండుగ పూట.. తాగునీటి కష్టాలు..!

Drinking Water: పండుగ పూట.. తాగునీటి కష్టాలు..!
కోటగిరి, మన సాక్షి :
పండుగ పూట తాగునీటి సమస్య పట్టించుకోవడంలేదని ఎస్సీ కాలనీవాసులు గురువారం ఆందోళనకు దిగిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. గత నాలుగు రోజుల నుంచి వాటర్ రావడం లేదని కాలనీవాసులు వాపోయారు.
గ్రామ పంచాయతీ సెక్రెటరీ కి ఎన్ని సార్లు చెప్పినా, గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మోటర్ కాలిపోయి ఐదు రోజులైంది అయినా పట్టించుకోవడం లేదు. పైపులైన్ పగిలిపోయినయ్, మోటర్లు కాలిపోయినయని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ దగ్గర నుంచి ప్రతిరోజు తీసుకొని వస్తున్నామని అంటున్నారు. ఎస్సీ కాలనీలో పట్టించుకునే నాధుడు లేదని వాపోయారు. పండగ పూట నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులు స్పందించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
MOST READ :
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!
-
Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!
-
ACB : ఏసీబీకి చిక్కిన లంచగొండి ఆఫీసర్..!









