Driving Test : డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇక కఠినతరం.. ఏప్రిల్ నుంచి అమలు..!
తెలంగాణ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇక కఠిన తరం కానున్నది. డ్రైవింగ్ పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దాంతో లైసెన్సులు పొందడం ఇక కఠినం కానున్నాయి.

Driving Test : డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇక కఠినతరం.. ఏప్రిల్ నుంచి అమలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇక కఠిన తరం కానున్నది. డ్రైవింగ్ పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దాంతో లైసెన్సులు పొందడం ఇక కఠినం కానున్నాయి. ఇకనుంచి డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేయడంలో మూడు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తుదారులకు ఎల్ ఎల్ ఆర్, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తూ రెండు దశల్లోనే డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తున్నారు.
వీటితో పాటు అదనంగా ఆన్‌లైన్ లో రోడ్డు భద్రత అవగాహన పరీక్షను కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో మూడు గంటల పాటు పరీక్షలో 6 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్కటి 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈ పరీక్ష రాసిన వారికి ఒక సర్టిఫికెట్ నెంబర్ కూడా కేటాయిస్తారు. దాని ఆధారంగానే లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ఈ విధానం ఏప్రిల్ నెలలో అమలు చేయనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :
- మాపై అమెరికా దాడి చేస్తే.. మేము భారత్ పై బాంబులేస్తాం, ఢిల్లీ, ముంబై లక్ష్యం..!
- Nalgonda : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య.. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం..!
- Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్క రోజులో రూ.29,400లకు..!
- రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వారికి మాత్రమే ఈ పథకం..!









