Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

TS News : బిల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. భవన నిర్మాణం రూల్స్ లో కీలక మార్పులు..!

తెలంగాణ రాష్ట్రంలో బిల్డర్స్ కు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. భవన నిర్మాణ నిబంధనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టి డి ఆర్ వినియోగంపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

TS News : బిల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. భవన నిర్మాణం రూల్స్ లో కీలక మార్పులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో బిల్డర్స్ కు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. భవన నిర్మాణ నిబంధనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టి డి ఆర్ వినియోగంపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హైరైజ్ గా గుర్తించింది. 750 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలాల్లో 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టిడిఆర్ తప్పనిసరిగా చేసింది. అదే విధంగా నాన్ హైరజ్ భవనాలకు టిడిఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలింపులు కూడా చేసింది.

హైరైజ్ భవనాల్లో సెట్ బ్యాక్ రిలాక్సేషన్ 10% వరకు అనుమతి ఇచ్చింది. 2000 చదరపు మీటర్లకు పైగా ఉన్న ప్లాట్ లలో అదనపు అంతస్తులకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 40 ఫీట్ల రోడ్డు వద్ద మూడు అదనపు అంతస్తులకు, 60 ఫీట్ల రోడ్డు వద్ద 4 అంతస్తులకు, 80 ఫీట్ల రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది.

10 అంతస్తులకు పైగా భవనాల్లో టిడిఆర్ వినియోగాన్ని తప్పనిసరిగా చేసింది. 20 అంతస్తులకు పైగా ఉన్న భవనాలకు ఐదు శాతం టి.డి.ఆర్ లోడింగ్ కల్పించింది. బిల్డింగ్ అనుమతి తీసుకునే సమయంలో 50 శాతం టీడీఆర్ సమర్పించి, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కు ముందు మిగతా 50 శాతం టీడిఆర్ సమర్పించాల్సి ఉంది.

ఎక్కువమంది చదివిన వార్తలు: 

మరిన్ని వార్తలు