Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమంహైదరాబాద్

TS News : డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఇక ఆ మహిళల ముఖాల్లో ఆనందం..!

తెలంగాణ ఆడపడుచులకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలియజేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలకు 2500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన బడ్జెట్ లో ప్రకటించారు.

TS News : డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఇక ఆ మహిళల ముఖాల్లో ఆనందం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆడపడుచులకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలియజేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలకు 2500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన బడ్జెట్ లో ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. హామీ మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలను ప్రకటించింది. డ్వాక్రా మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి గాను 18 సంవత్సరాల పైబడిన వారు.. 61 సంవత్సరాలు దాటిన వారు కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

కాగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు 5000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తూ అండగా ఉంటుంది. ఆరోగ్య, విద్యా అవసరాల కోసం శ్రీనిధి ద్వారా రుణాలను కూడా అందజేస్తుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు కూడా అందజేస్తుంది. ఇప్పుడు వడ్డీ లేకుండా డ్వాక్రా సంఘాలకు 2500 కోట్ల రూపాయలను రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. దాంతో మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

MOST READ :

మరిన్ని వార్తలు