దారి లేకపోవడంతో రెండేళ్లుగా బీళ్లుగా మారిన గిరిజన రైతుల భూములు.. పరిశీలించిన ఆర్డిఓ..!
దారి లేకపోవడంతో రెండేళ్లుగా బీళ్లుగా మారిన గిరిజన రైతుల భూములు.. పరిశీలించిన ఆర్డిఓ..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురం లో గిరిజన రైతులకు సంబంధించిన – రహదారి పంచాయతీ పై సోమవారం ఆర్డీవో గణేష్ విచారణ చేపట్టారు. తిరుమలాపురంలో 50 ఎకరాల సాగు భూమి కి రహదారి లేకుండా ఏర్పాటు చేయటంతో గత రెండేళ్ల నుంచి సాగు చేయకుండా వదిలేశారు. ఇటీవల రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి గిరిజనులు వారి గోడు ను వినిపించారు.
స్పందించిన మంత్రి వెంటనే ఆర్డీఓ ను విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో భూముల కు చెందిన నక్షాను పరిశీలించారు. రెవిన్యూ అధికారులను రహదారి పంచాయతీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో తిరుమలాపురం,లోని భూముల వద్దకు పరిశీలించారు. బాదిత గిరిజన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో గణేష్ మాట్లాడారు…దారి పంచాయతీ గురించి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
పూర్తి స్థాయిలో టీపన్ సర్వే, నక్షాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట తహశీల్దార్ గౌరి శంకర్, డిప్యూటీ తహశీల్దార్ ఇమ్రాన్, రెవిన్యూ ఇన్సేపెక్టర్లు ఆలస్యం మధుసూధన్రావు, మాధవి, సర్వేయర్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Banks : బ్యాంకుల వద్దకు రైతుల ఉరుకుల పరుగులు.. రెండు గ్రామాలకోరోజు, రోజుకు 50 మందికి రెన్యువల్..!









