Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

District collector : రాంపూర్ లో దుర్గ రాజు ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!

District collector : రాంపూర్ లో దుర్గ రాజు ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!

కొల్చారం, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రవేశ పెట్టడం శుభపరిణామమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

కొల్చారం మండలం రాంపూర్ లో సన్నబియ్యం లబ్ధిదారు దుర్గ రాజు గృహంలో కుటుంబం సభ్యుల తో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ సోమవారం జిల్లా కలెక్టర్ సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కొల్చారం మండలం రాంపూర్ లో విస్తృతంగా పర్యటించి సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సన్నబియ్యం లబ్ధిదారు దుర్గ రాజు గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దుర్గరాజు కుటుంబ సభ్యులు సన్న బియ్యం పథకం మా కుటుంబానికి ఎంతోమేలు చేస్తుందని తెలిపారు. సన్న బియ్యం అన్నంతో కడుపునిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగ పడుతుందని తెలిపారు.

మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం అని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 07 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, తాసిల్దార్ గఫర్ మియా, ఎంపీ ఓ కృష్ణవేణి సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Investors : ఇన్వెస్టర్లకు శుభవార్త.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్ ప్రారంభం..!

  2. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  3. Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!

  4. Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!

మరిన్ని వార్తలు