Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Admissions : కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు.. పాఠశాలల దోపిడీ షురూ..!

Admissions : కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు.. పాఠశాలల దోపిడీ షురూ..!

గోదావరిఖని టౌన్, మన సాక్షి :

విద్యా సంవత్సరం ముగియక ముందే నగరం లోని ఓ కార్పొరేట్ పాఠశాల ముందస్తు అడ్మిషన్లు మొదలెట్టాయి.. ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడి షురూ చేశారు. సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రాయితీ అంటూ నమ్మబలికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీనికి ముందస్తుగా సీట్ బుకింగ్ కోసం 5 వేల నుండి 10వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

విద్యా సంవత్సరం ముగియక ముందు ఎలాంటి అడ్మిషన్లు చేపట్టరాదని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ పలు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా అడ్మిషన్లు చేపడుతున్నాయి. విద్యా సంవత్సరం ముగిశాక మాత్రమే అడ్మిషన్లు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ యదేచ్చగా అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ముందుగా మా పాఠశాలలో సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ అమాయక తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. తల్లిదండ్రుల అమాయ కత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుం టున్నారు.

సంబంధిత విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే సీట్ గ్యారెంటీ అంటూ పేర్కొంటున్నాయి.

టీచర్లు, సిబ్బందికి టార్గెట్లు : 

కార్పొరేట్ స్కూల్ లో అడ్మిషన్లకు పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కొక్కరికి 50 నుండి 100 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి చేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్ల టార్గెట్ ఏంటని పలువురు టీచర్స్, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్లు పూర్తి చేయని వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామంటూ యాజమా న్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తమపై అడ్మిషన్ల టార్గెట్ పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని పలువురు టీచర్లు, సిబ్బంది వాపోతున్నారు.

By : Shankar

98495 49011

MOST READ 

TG News : మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు.. ఈసారి కేటీఆర్ పైన..!

Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!

WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!

  1. Hyderabad : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం..!

మరిన్ని వార్తలు