Breaking Newsఆంధ్రప్రదేశ్
ఏపీలో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు..!

ఏపీలో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. దాంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం డిసెంబర్ 5న తెల్లవారుజామున 3 .14 గంటల సమయంలో నమోదయింది. ఆకస్మాత్తుగా భూమి కల్పించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
జనం ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. భూకంపం సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్దిసేపటి తర్వాత ప్రజలు ఊపిరి పీల్చు కున్నారు. ఉదయం అధికారులు సమాచారా న్ని తెలుసుకొని ఎలాంటి భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదు అని పేర్కొన్నారు.









