Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం సీజన్ లో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసింది. దొడ్డు రకం దాన్యంతో పాటు సన్న రకం ధాన్యం కూడా కొనుగోలు చేసింది.

సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు అదనంగా 500 రూపాయల బోనస్ కూడా అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 41.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వారి వారి ఖాతాలలో నేరుగా డబ్బులను జమ చేసింది.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 7887 కోట్ల రూపాయలను 7.5 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. రైతులకు బోనస్ కిందనే 314 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఏదైనా కారణాలతో రైతుల ఖాతాలలో డబ్బులు మూడు రోజులలో జమ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం విక్రయించిన కొనుగోలు కేంద్రం పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయించింది, విక్రయించిన తేదీ, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఒక పేపర్ మీద రాసుకొని ఉంచుకోవాలని పేర్కొన్నారు.

దాన్యం డబ్బులు జమ కాని రైతులు వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అంతేకాకుండా 1800 425 0033 నెంబర్ కు వాట్సప్ లో మెసేజ్ చేయవచ్చునని తెలిపారు.

అంతేకాకుండా సివిల్ సప్లై మార్కెటింగ్ ఆఫీసుకు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చును. డబ్బులు రాని రైతులు ఫిర్యాదు చేస్తే మూడు నుంచి ఏడు రోజుల్లోగా వారి ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.

MOST READ : 

  1. TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

  2. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

  3. TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!

  4. TG News : ట్రాఫిక్ చలాన్ లపై భారీ డిస్కౌంట్.. 100% వరకు ఛాన్స్..!

మరిన్ని వార్తలు