Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూధార్ కార్డులు సిద్ధమయ్యాయి. ప్రతి రైతుకు భూదార్ కార్డులను పంపిణీ చేయడానికి వ్యవసాయ అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూదార్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సమీక్ష సమావేశంలో భూదార్ కార్డుల విషయాన్ని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతులకు భూధార్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

రెండో దశలో భాగంగా నక్షాలు లేని 373 గ్రామాల్లో సర్వే చేసి భూముల హద్దులు నిర్ధారించి భూధార్ కార్డులు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మూడో దశలో ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలియజేశారు. మొత్తం 3,490 మంది లైసెన్స్ సర్వేయర్లను ఇప్పటికీ అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 2500 మందిని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ధరణి వెబ్సైట్ ను రూపుమాపి భూముల వివరాలు, సర్వే సమాచారం, రిజిస్ట్రేషన్ వివరాలు ఒకే వేదికపై ఉండేలా ఏకీకృతమైన వెబ్సైట్ ను జనవరి 2026 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!

  2. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  3. TG News : ట్రాఫిక్ చలాన్ లపై భారీ డిస్కౌంట్.. 100% వరకు ఛాన్స్..!

  4. Narayanpet : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

మరిన్ని వార్తలు