Elections : ఎన్నికల్లో.. ప్రధాన ప్రచార అస్త్రం.. అత్యంత వేగంగా ప్రజల్లోకి..!
Elections : ఎన్నికల్లో.. ప్రధాన ప్రచార అస్త్రం.. అత్యంత వేగంగా ప్రజల్లోకి..!
ఎన్నికల్లో ప్రధాన ప్రచార వేదికగా సోషల్ మీడియా
నాయకులకు సొంత యూట్యూబ్ చానల్స్
హైదరాబాద్ , మన సాక్షి :
ప్రస్తుత ఎన్నికల తరుణంలో ప్రధాన ప్రచార అస్త్రంగా సోషల్ మీడియా టాప్ లో ఉంది. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ఉన్నప్పటికీ.. ఇంతలా ప్రచారాస్త్రంగా నాయకులు ఉపయోగించుకోలేదు. కానీ ప్రస్తుతం ప్రధాన మీడియాను సోషల్ మీడియా మించిపోయిందని చెప్పవచ్చును.
ప్రతి నాయకుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ , ట్విట్టర్ తో పాటు పలు రకాల సోషల్ మీడియాను పెంచుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి నాయకుడు కూడా సోషల్ మీడియా ప్రచారానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచారాలు చేసుకుంటున్నారు.
ALSO READ : WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఓకే ఫోన్ లో రెండు ఖాతాలు..!
ప్రధాన మీడియా కంటే కూడా సోషల్ మీడియా అత్యంత వేగంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోతుందని చెప్పవచ్చును. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ వాడకం ఉంది . దానివల్ల రాష్ట్రంతో పాటు తమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉంటుందని విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్నారు.
ఫేస్ బుక్ , యూట్యూబ్ ద్వారా సమావేశాలు ప్రెస్ మీ ట్ లు సైతం లైవ్ లు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ను నడుపుతున్నారు.
రెండేళ్లుగా విస్తృత ప్రచారం :
సోషల్ మీడియా ప్రభావం గత రెండు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయింది . కరోనా సమయం నుంచి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే ప్రధాన భూమిక పోషించే స్థాయికి వెళ్ళింది. వివిధ రాజకీయ పార్టీలు నాయకులు సైతం గత రెండు సంవత్సరాల నుండి వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం నిర్వహించుకుంటున్నారు.
ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. రాష్ట్రస్థాయి నాయకులు సైతం సోషల్ మీడియా వేదిక రాష్ట్రస్థాయి నాయకులకు సైతం సోషల్ మీడియా వేదికగా మారింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో సోషల్ మీడియానే ప్రధాన ప్రచారంగా వాడుకుంటున్నారు. ఆయన ప్రతి కార్యక్రమాన్ని ఫేస్ బుక్ లైవ్ లో ఉంచడంతో పాటు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!
అదేవిధంగా అధికార పార్టీకి చెందిన మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇటీవల కాలంలో ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాము. బిజెపి నాయకులు ఎప్పటినుంచో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడంతో పాటు ప్రచారాలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారమే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారంతో ప్రధాన మీడియా పక్కకు వెళ్లిందని చెప్పవచ్చును.










