Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీ

Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

మన సాక్షి , ఇంటర్నెట్ :

చిరు వ్యాపారులకు గూగుల్ పే మంచి అవకాశం కల్పించింది. చిరు వ్యాపారులే కాకుండా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం గా చెప్పుకోవచ్చు. డబ్బుల కోసం చింతించాల్సిన పనిలేదు. నెలకు కేవలం 111 రూపాయల ఈఎంఐ కడితే సరిపోతుంది. దానికి మీ దగ్గర గూగుల్ పే ఉంటే చాలు. ఆ వివరాలు తెలుసుకుందాం..

గూగుల్ పే చిరు వ్యాపారులకు, సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించు కోవాలనుకునే వారికి కొంత మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. దానిని డైలీ ఫైనాన్స్ ల వద్ద తీసుకుంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివారికి చాలా తక్కువ వడ్డీతోపాటు నెల నెలా ఈఎంఐ చెల్లించే సదుపాయాన్ని గూగుల్ పే కల్పించేందుకు సిద్ధమైంది.

ALSO READ : పాలమూరులో 31న కాంగ్రెస్ ప్రజాభేరి

సాషే లోన్స్ పేరుతో గూగుల్ ఇండియా రిటైల్ లోన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, అంతేకాకుండా వ్యాపార అవసరాలకు డబ్బు అవసరమైన వారికి 15 వేల రూపాయల వరకు గూగుల్ పే లోన్ ఇవ్వనున్నది. అందుకుగాను నెలకు కేవలం 111 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ లోన్ తీసుకునేందుకు మీ వద్ద గూగుల్ పే ఉంటే సరిపోతుంది. చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా గూగుల్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని వ్యాపారులకు తరచుగా స్వల్పకాలిక రుణాలు అవసరమవుతాయని ఈ సాషే లోన్స్ ప్రారంభించినట్లు గూగుల్ ఇండియా తెలిపింది. దీని ద్వారా 15 వేల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. వాటిని నెలసరి ఈఎంఐ గా 111 రూపాయల కంటే తక్కువ మొత్తంలో తిరిగి చెల్లించే సదుపాయం కల్పించింది.

అందుకుగాను డి ఎం ఐ ఫైనాన్స్ సంస్థతో గూగుల్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. చిన్న మొత్తాల్లో సులభమైన వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే రుణాలు చాలామందికి అవసరం అవుతాయి.. ఆ అవసరాలను తీర్చేందుకు గూగుల్ పే లో సాషే లోన్స్ ను డిఎంఐ ఫైనాన్స్ భాగస్వామ్యంతో అందిస్తున్నామని కంపెనీ పేర్కొన్నది. ఈ వివరాలను గూగుల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.

వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఈ – పేలేటర్ సంస్థ భాగస్వామ్యంతో క్రెడిట్ లైన్ ను కూడా గూగుల్ పే అందిస్తుంది. చిరు వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధికి అన్ని ఆన్‌లైన్, ఆఫ్ లైన్ పంపిణీ దారుల వద్ద ఈ సేవలను పొందవచ్చును. ఐసిఐసిఐ భాగస్వామ్యంతో కూడా గూగుల్ సంస్థ యూపీఐ అగ్రిగేటర్ గూగుల్ పే ద్వారా రుణాలను అందించే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంకు తో కలిసి వ్యక్తిగత రుణాలు కూడా అందిస్తుంది.

ALSO READ: రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!

మరిన్ని వార్తలు