Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంహైదరాబాద్

పాలమూరులో 31న కాంగ్రెస్ ప్రజాభేరి

పాలమూరులో 31న కాంగ్రెస్ ప్రజాభేరి

హాజరుకానున్న ప్రియాంకాగాంధీ

హైదరాబాద్, మన సాక్షి :

ఈ నెల 31న పాలమూరు కు ప్రియాంక గాంధీ రానున్నారు పాలమూరు ప్రజా బేరి సభలో ఆమె ప్రసంగించనున్నారు. ప్రజాభేరి పేరున ఈ నెల 31వ తేదీన కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక సందర్భంలోనే ప్రియాంకా గాంధీతో కొల్లాపూర్లో సభ ఏర్పాటు చేయించాలని భావించినా అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆమెతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు సభ ఏర్పాట్లపై హైదరాబాద్ లోని మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్రావు, ప్రతాప్ గౌడ్, విజయభాస్కర్రెడ్డి ఆదివారం చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈ ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ALSO READ : రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!

మరిన్ని వార్తలు