Miryalaguda : అధికార అండతో కోట్ల రూపాయల సీలింగ్ భూముల ఆక్రమణ.. రిజిస్ట్రేషన్ రద్దు చేసిన రెవెన్యూ అధికారులు..!

Miryalaguda : అధికార అండతో కోట్ల రూపాయల సీలింగ్ భూముల ఆక్రమణ.. రిజిస్ట్రేషన్ రద్దు చేసిన రెవెన్యూ అధికారులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ అండదండలతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల లో విలువైన కోట్ల రూపాయల విలువైన సీలింగ్ భూములను అక్రమార్కులు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు. వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం, వీర్లపాలెం మధ్యలో యాదాద్రి పవర్ ధర్మల్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతుంది.
వాటికి అత్యంత సమీపంలోనే కొత్తపల్లి గ్రామ రెవెన్యూ శివారులో ఉన్న సీలింగ్ భూములపై నాటి అధికార పార్టీ నాయకులకు కన్ను పడింది. దాంతో కోట్ల రూపాయల విలువైన సీలింగ్ భూములను కాజేశారు. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ కు సమీపంలోని తాళ్ల వీరప్పగూడెంలో సర్వేనెంబర్ 66, 67లో 23.37 ఎకరాల భూమి బేబీ శెట్టి శేషమ్మ పేరుతో ఉంది.
అయితే 1997లో సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమిపై నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు పట్టాలు పొందినట్టు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దాంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తేలింది.
ఆ భూములలో అంబటి రామాంజనేయులు ఆరు ఎకరాలు, వింజం ముసలయ్య 5.29 ఎకరాలు, సాధినేని శ్రీనివాసరావు 2.25, ఎకరాలు రాయికింది దివ్య మూడు ఎకరాలు, నాలావత్ కమిలి మూడు ఎకరాలు, ఇండియన్ సిమెంట్ ఒక ఎకరం పట్టాలు పొందినట్లు అధికారులు గుర్తించారు.
కాగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు పొందిన రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తున్నట్లు దామరచర్ల తాసిల్దార్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆ గ్రామ పరిధిలో వివిధ సర్వే నెంబర్లలో మరో 120 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఆ భూములపై కూడా నాటి అధికార పార్టీని అండగా పెట్టుకొని మరి కొంతమంది కూడా అక్రమాలు చేసి రిజిస్ట్రేషన్లు పొందినట్లు తెలుస్తోంది. వాటిపై కూడా సమగ్ర విచారణ అధికారులు జరుపుతున్నారు.
ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని అక్రమార్కులు సీలింగ్ భూములను కాజేసినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ ల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
MOST READ :
-
Komatireddy Venkatreddy : పది రోజులలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్లు.. మంత్రి కోమటిరెడ్డి..!
-
MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)
-
Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)
-
Good News : మహిళలకు శుభవార్త, వడ్డీ లేకుండా రూ.5 లక్షలు.. దరఖాస్తు ఇలా..!
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)









