Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

ACB : లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడిన ఎస్సై..!

ACB : లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడిన ఎస్సై..!

రామసముద్రం,  మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎస్సై ఓ లారీ యజమాని దగ్గర లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని రామసముద్రం మండలంలో ఎస్సైగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య ఏటవాకిలికి చెందిన లారీ ప్రమాదానికి సంబంధించిన కేసులో లారీ యజమాని దగ్గర లంచం డిమాండ్ చేశాడు.

దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు వలపన్ని పెట్రోల్ బంకు వద్ద ఎస్ఐ కి 70 వేల రూపాయలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.  అయితే రామసముద్రంలో ఏసీబీ అధికారులు ఎస్ఐ ని పట్టుకున్నారని తెలియడంతో కలకలం రేపుతోంది. లంచం డిమాండ్ చేసిన విషయంపై సిఐ ప్రమేయం ఉందని భావించిన ఎసిబి అధికారులు సీఐ రమేష్ ని ఏసీబీ ఏ ఎస్పీ విమల కుమారి, డిఎస్పీ జెస్సి ప్రశాంతి విచారణ చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : తప్పిపోయిన తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్.. సాగర్ కాలువలో మృతదేహం లభ్యం..!

  2. Gold Price : మరోసారి షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!

  4. మూగవాడి ఎర్రపల్లె లో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న వైసీపీ నాయుకులు జయరామిరెడ్డి..!

మరిన్ని వార్తలు