TG News : 11 నెలలు గడిచినా.. ఇక్కడ ఇంకా సీఎంగా కేసీఆర్ ఫోటోనే..!
TG News : 11 నెలలు గడిచినా.. ఇక్కడ ఇంకా సీఎంగా కేసీఆర్ ఫోటోనే..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ విభాగంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫోటోనే ఉంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 11 నెలలు కూడా గడిచాయి.
కానీ దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం ఇంకా కెసిఆర్ ఫోటోని కొనసాగిస్తున్నారు. దేవరకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫోటోనే దర్శనమిస్తోంది. ఇది పూర్తిగా వైద్యాధికారుల నిర్లక్ష్యమే అని ఆసుపత్రికి వచ్చిన రోగులు పేర్కొంటున్నారు.
ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో మాత్రం చిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా అది మూడు రోజులకే పోయింది. తిరిగి రేవంత్ రెడ్డి ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటోనే కనిపించే విధంగా ఉంచారు.
ఇది పూర్తిగా వైద్యాధికారుల నిర్లక్ష్యమే అని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయాలని అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై భారీగా రైతుల రాస్తారోకో..!
-
Gold Price : పసిడి భారీగా తగ్గింది.. కొనుగోలుదారులకు మంచి తరుణం..!
-
District collector : వికారాబాద్ జిల్లా కలెక్టర్ వాహనంపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!









