TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!

Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గానికి 3000 గృహాలను మంజూరు చేయనున్నారు.

కాగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రేషన్ కార్డును ప్రాతిపదికన తీసుకునేది లేదని, మొదటి విడతలో పేదోళ్లు, బహు పేదోళ్లు అనే కేటగిళ్లవారిగా పరిశీలించి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తర్వాత త్వరలో రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా రెండవ విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందడానికి అర్హులుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆసరా పెన్షన్లకు కూడా అర్హులైన వారిని గుర్తించి అందజేస్తామని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు