MLA : ప్రతి నిరుపేద కుటుంబం సన్న బియ్యం భోజనం చేయాలి..!
MLA : ప్రతి నిరుపేద కుటుంబం సన్న బియ్యం భోజనం చేయాలి..!
చింతపల్లి, మనసాక్షి :
ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సన్న బియ్యం భోజనం మూడు పూటలా కడుపునిండా భుజించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించి, లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలుదేశించి వారు మాట్లాడరు.
గత పాలకుల పదేండ్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని ఎవరికి ఎలాంటి బిల్లులు చెల్లించకుండా పెండిగ్ లో పెట్టి పోతే..పదేండ్లలో జరిగిన ఆర్ధిక విధ్వంసాన్ని గాడిలో పెడ్తూ రాష్ట్రాని ప్రగతి పథంలో నడిపిస్తూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజల జీవితాల్లో మార్పు రావాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలతో 2025 – 26 బడ్జెట్ రూపొందించి ప్రజా పాలన సాగిస్తున్నాం అని అన్నారు.
గ్రామంలోని ఆడబిడ్డల భద్రత, శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు.
రేషన్ కార్డుల ద్వారా వారికి నిత్యావసర వస్తువుల సరఫరా చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇండ్లకు అర్హత పొందిన పేద కుటుంబాలకు గృహాల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇంటి పథకాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
కళ్యాణాలక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మా ప్రభుత్వం సంక్షేమ పరిపాలనకు నిదర్శనం. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, ప్రతి అమ్మాయి జీవితాన్ని వెలుగులు నింపేలా చేయడం మా లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి,మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాస భాస్కర్ మాజీ సర్పంచులు ముచ్చర్ల యాదగిరి,అంగిరేకుల గోవర్దన్, గుండ్లపల్లినర్సిరెడ్డి, దొంత వెంకట నరసింహారెడ్డి, కాయితి జితేందర్ రెడ్డి,
వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి గుండెమోని కొండల్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు కాసరం శ్రీను, నర్సింహా, గ్రామ శాఖ అధ్యక్షులు గోవింద్ రవి,దాసరి రాజు, మార్కెట్ డైరెక్టర్ హన్మ నాయక్, ,సుధాకర్ రెడ్డి,, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్, రియాజ్ పాషా, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, ఎంపిడిఓ సుజాత, డిప్యూటీ తాసిల్దార్ ఎండి అసద్ మండల అధికారులు, పలు శాఖల అధికారులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, మండలంలోని వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పంచాయతీ కార్యదర్శులు వివిధ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
మద్యానికి బానిస అయిన భర్త.. డబ్బులు ఇవ్వడంలేదని భార్య హత్య.. నిందితుడు అరెస్టు..!
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Women Entrepreneurs : ఆర్థికంలో అదరగొడుతున్న మహిళలు.. పొదును నుంచి పెట్టుబడుల వరకూ వారే..!









