TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!

Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!

మన సాక్షి , అమరావతి :

ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలను డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం వేయనున్నది. ఆడబిడ్డ నిధి పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రత్యేక పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. వివరాల ప్రకారం.. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ లబ్ధిదారు రాలికి నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు అందనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరనున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ కరుణతో సమాజాన్ని మార్చడమే మారుతున్న లక్ష్యం ఆడబిడ్డలకు ప్రత్యేక భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం మహిళల ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఈ తరహా పథకాలు లేనప్పటికీ తమ ప్రభుత్వం ముందుగానే ఆడబిడ్డల కోసం ఈ పథకం ఆర్థిక బలాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి

  1. Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!

  2. Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

  3. Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!

  4. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

  5. Bajaj Allianz: బజాజ్ అలయన్జ్ పాలసీదారులకు అదిరే శుభవార్త.. రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్..!

మరిన్ని వార్తలు