Local Body Elections : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికకు సర్వం సిద్ధం..!

Local Body Elections : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికకు సర్వం సిద్ధం..!
చింతపల్లి, మనసాక్షి :
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం చింతపల్లి మండలంలో 17న జరగనున్న ఎన్నికల కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సుజాత పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో ఎన్నికల మెటీరియల్ ను సర్వం సిద్ధం చేసి మండలంలోని 32 గ్రామాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తున్నారు.
చింతపల్లి మండలం ,లో మొత్తం 36 గ్రామ పంచాయతీలకు గాను 45 వేల 54 ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. అందులో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 34 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇందులో మొత్తం42,654 ఓటర్లు పురుషులు 21,227, మహిళా ఓటర్లు 21, 421 ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 6 గురు జోనల్ ఆఫీసర్లు, 12 మంది రూట్ ఆఫీసర్లు. 268 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం 804 పిఓ, ఓపిఓగా, అసిస్టెంట పోలింగ్ సిబ్బందిగా విధుల్లో పాల్గొననున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు మండలంలోని ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల మెటీరియల్ తో వాహనాలు తరలిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సుజాత పేర్కొన్నారు.
MOST READ
-
పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..!
-
TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!
-
TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!









