Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!

Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం సృష్టించింది. వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారితో మిర్యాలగూడకు లింకు ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కేసు విచారణలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగం పొందిన వారిలో ఏ ఈ ఓ లు నరేష్ కుమార్, నాగరాజును గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. మిర్యాలగూడ కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
మిర్యాలగూడ చెందిన బాలకృష్ణ అనే మధ్యవర్తి ద్వారా సర్టిఫికెట్లు పొందినట్లు తెలిసింది. కాగా బాలకృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్క సర్టిఫికెట్ కు రూ. 90 వేల నుంచి 1.20 లక్షల రూపాయలు వరకు తీసుకొని ఉత్తర ప్రదేశ్ లోని యూనివర్సిటీల నుంచి అగ్రికల్చర్ డిప్లమా చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినట్లు సమాచారం.
మిర్యాలగూడ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్లో సుమారుగా 100 మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినట్లు తెలుస్తుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను విక్రయించినట్లు తెలుస్తుంది.
గద్వాలలోనే సుమారుగా 12 మంది నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుంది. వ్యవసాయ శాఖ తో పాటు విద్యాశాఖలో కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు తెలియడంతో పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందినట్లు సమాచారం.
■ MOST READ :
-
SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!









