Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!

Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!

మన సాక్షి, నల్గొండ / మిర్యాలగూడ :

నల్గొండ జిల్లాలో సంచలనం.. జిల్లాలోని మిర్యాలగూడలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టయింది. అక్రమ వసూళ్లకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న నకిలీ రిపోర్టర్ల ఆగడాలను పోలీసులు బట్టబయలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులపై అడ్డగోలుగా రాతలు రాస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఆ ఫేక్ రిపోర్టర్లు.

అయితే బాధితులు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ మెయిల్ చేసిన వీడియోస్, ఆడియోస్ తో వారు ఎస్పీకి మొరపెట్టుకున్నారు. లక్షల్లో ముట్ట చెబితే వార్తలు ఆపేస్తామంటూ.. లేదంటే వార్తలు రాస్తామంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్న ఆడియో వైరల్ గా మారింది.

సీఐని టార్గెట్ చేసిన నకిలీ రిపోర్టర్ల ముఠా ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఫేక్ రిపోర్టర్లకు 1.10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ఓ సి ఐ. ఇంకా డబ్బులు కావాలంటే వేధించడంతో కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

కాగా మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ జరిపి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న రిపోర్టర్ల పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఒకరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మిగతా ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్ చేసిన వారిపై పీడియాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

MOST READ :

  1. TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

  2. సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!

  3. Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు..!

  5. BREAKING : గుండెపోటుతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి..!

మరిన్ని వార్తలు