తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!

Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!

మాడుగులపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఎరువులను కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని డీలర్లు ఈ-పాస్ యంత్రం ద్వారా మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆయన సూచించారు.

ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలో సరిపడినంత యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు యూరియాను ఎక్కువ మొత్తంలో కాకుండా అవసరానికి తగినట్టు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఎవరైనా డీలర్లు నాసిరకం విత్తనాలు అందిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి ఎం.శివరాం కుమార్, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  2. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : నల్గొండలో మంత్రి ఆడ్లూరికి జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం..!

  4. Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!

  5. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు