Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!
Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఎకరానికి 15వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని చెప్పినప్పటికీ 12 వేల రూపాయల సహాయం అందజేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఎకరానికి రైతుబంధు పథకం పేరుతో పంట పెట్టుబడి సహాయంగా పదివేల రూపాయలను అందజేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 2000 రూపాయలను పెంచింది. కాగా మార్చి నెలాఖరు వరకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం ఒక విడత ఎకరానికి 6000 రూపాయలు అందజేశారు.
కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ కాలేదు. వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు నాలుగు ఎకరాల పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు. దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశతో ఉన్నారు.
ప్రభుత్వం ఇప్పుడు ఇస్తాం.. అప్పుడు ఇస్తాం.. అంటూ ప్రకటనలు చేస్తుందే తప్ప ఇప్పటివరకు రైతు భరోసా పూర్తిస్థాయిలో అందజేయలేదు. దాంతో రైతుల్లో మరింత నిరాశ పెరుగుతుంది. వానకాలం సీజన్ లో రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగి సీజన్ లో కూడా పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో మరింత నిరాశ పెరిగింది.
MOST READ :
-
Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!
-
Rythu : రైతులు వాటి వినియోగాన్ని తగ్గించాలి..!
-
Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Devarakonda : చిరు వ్యాపారులకు సీరియస్ వార్నింగ్.. బందోబస్తు మధ్య రోడ్లపై తోపుడు బండ్ల తొలగింపు..!
-
Award : ఆ మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు..!









